జగన్, షర్మిల దిగజారుడుతనానికి అది నిదర్శనం: దేవినేని అవినాశ్
- 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును విమర్శిస్తున్నారు
- కొడాలి నాని అరాచకాలు వీధి రౌడీలను మించిపోయాయి
- గుడివాడలో వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోయింది
గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వీధి రౌడీలను మించిపోయి అరాచకాలు సృష్టిస్తున్నారని అవినాశ్ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని... అందుకే తాము మౌనంగా ఉన్నామని చెప్పారు. గుడివాడలో వైసీపీ ఓడిపోవడం ఖాయమని తేలిపోయిందని... అందుకే కొడాలి నాని అరాచకాలకు తెరలేపారని అన్నారు.