Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ సినిమాకి సమంతను తీసుకోమని నేను చెప్పలేదు: నాగచైతన్య

  • 'నిన్నుకోరి' సినిమాను శివ నిర్వాణ చాలా బాగా తీశాడు
  •  ఈ సినిమా చూసే ఆయనకి నేను కాల్ చేశాను
  • తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వుంది
నాగచైతన్య .. సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమా, ఈ నెల 5వ తేదీన విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ లో చైతూ .. సమంత బిజీగా వున్నారు. తాజా ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ .. "నాని కథానాయకుడిగా చేసిన 'నిన్నుకోరి' చూశాను. ఈ కథను దర్శకుడు శివ నిర్వాణ డీల్ చేసిన తీరు చాలా బాగుందనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ చిత్రీకరణలో శివ నిర్వాణ ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఆయనకి ఫోన్ చేసి .. నా బాడీ లాంగ్వేజ్ కి తగిన కథను సిద్ధం చేయమని చెప్పాను.

రెండు నెలల తరువాత ఒక కథను తీసుకొచ్చి వినిపించాడు. 20 నిమిషాల పాటు ఆయన కథ చెప్పగానే .. 'ఈ సినిమాను మనం చేస్తున్నాము' అని చెప్పాను. ఇక ఈ సినిమాలో కథానాయికగా సమంతను తీసుకోమని నేను చెప్పలేదు. హీరోయిన్ గా సమంత అయితే బాగుంటుందని దర్శకుడు శివ నిర్వాణ అన్నాడు. సమంత .. నేను కలిసి చేయడానికి తగిన కథ ఇది అని నాకు అప్పుడు అనిపించింది. ఈ సినిమా తప్పకుండా విజయవంతమవుతుందనే నమ్మకం వుంది" అని ఆయన చెప్పాడు. 
chaitu
samanta

More Telugu News