ప్రకటించిన కాసేపటికే కుప్పకూలిన కాంగ్రెస్ 'మేనిఫెస్టో' వెబ్సైట్!
- కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసిన సోనియా గాంధీ
- వెబ్‌సైట్‌కు పెరిగిన ట్రాఫిక్
- మరింత పకడ్బందీగా తీసుకొస్తామన్న కాంగ్రెస్
యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కలిసి మంగళవారం ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. నిరుద్యోగులు, రైతులకు కాంగ్రెస్ బోల్డన్ని హామీలు ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే వచ్చే ఏడాది మార్చిలోగా 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉపాధి హామీ పథకం కింద అదనంగా వంద రోజుల పనికల్పిస్తామని, రైతుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ తయారుచేస్తామని హామీ ఇచ్చింది.