కుండ తయారీకి ఎంత నైపుణ్యం, ఓపిక అవసరమో ప్రత్యక్షంగా చూశా: నారా లోకేశ్
- శాలివాహన కాలనీలో ఎన్నికల ప్రచారం
- కుమ్మరుల సమస్యలకు సరైన పరిష్కారం చూపుతా
- వారి అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తాం
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, రోజువారీ పనులలో వారికి ఎదురయ్యే సమస్యలకు సరైన పరిష్కారం చూపుతానని, వారి అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక కుమ్మరి సోదరుడితో కలిసి కుండ తయారీలో పాల్గొన్నారు. కుండ తయారు చేసే క్రమంలో ఎంత నైపుణ్యం, ఓపిక అవసరమో ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నానని లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.