Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రతిరోజు రాత్రివేళ ఒక అమ్మాయి కాల్ చేసేది .. కానీ ఏమీ మాట్లాడేది కాదు: సింగర్ కారుణ్య

  • రాత్రి 12 అవుతుండగా కాల్ వచ్చేది 
  • ఒక నెంబర్ ను బ్లాక్ చేస్తే మరో నెంబర్ నుంచి చేసేది
  •  పాతిక నెంబర్ల వరకూ బ్లాక్ చేస్తూ వెళ్లాను    
తాజాగా 'అలీతో సరదాగా' కార్యక్రమంలో గాయకుడు కారుణ్య మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చాడు. "ప్రతి రోజు రాత్రి 12 అవుతుండగా ఒక అమ్మాయి నుంచి నాకు కాల్ వచ్చేది. ఒకసారి మాత్రం తను 'కారుణ్య' అని అనడం వలన అవతల వున్నది అమ్మాయి అనే విషయం నాకు అర్థమైంది. తాను ఎవరన్నది చెప్పదు .. ఏమీ మాట్లాడదు. ఆమె ఊపిరి శబ్దం మాత్రం నాకు వినిపిస్తూ ఉండేది.

ఇలా కొంతకాలం జరగడంతో ఆ నెంబర్ ను నేను బ్లాక్ చేసేశాను. దాంతో ఆ అమ్మాయి ఊరుకోలేదు .. మరో నెంబర్ నుంచి చేసేది .. మళ్లీ తన ఊపిరి శబ్దమే నాకు వినిపించేది. మళ్లీ ఆ నెంబర్ ను కూడా నేను బ్లాక్ చేసేశాను. అలా నేను 25 నెంబర్లు బ్లాక్ చేస్తూ వెళ్లాను. ఇక ఒకసారి మాత్రం విసిగిపోయి సైబర్ క్రైమ్ వాళ్లకి ఫిర్యాదు చేయాలనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి నుంచి కాల్స్ రావడం ఆగిపోయింది. ఆ అమ్మాయి ఎవరోగానీ కొంతకాలం పాటు బాగానే ఇబ్బంది పెట్టింది" అని చెప్పుకొచ్చాడు.
karunya

More Telugu News