బుద్ధా వెంకన్న గారు... మనం ఒకరి ముఖం మరొకరు చూసుకోవాలి: మోహన్ బాబు
- నోరుంది కదా అని ఊరికే పారేసుకోకండి
- విమర్శలకు కూడా ఒక హద్దు ఉంటుంది
- మా ఇంట్లో కూర్చొని మీరు ఏం మాట్లాడారో మరచిపోవద్దు
ఇటీవల బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ, ఎవరు ప్యాకేజీ ఇస్తే వారి గురించి ఊసరవెల్లిలా మోహన్ బాబు మాట్లాడతారని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుపై బురద చల్లేందుకు మోహన్ బాబుకు ఎంత పారితోషికం అందిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ కు పది రోజుల కాల్షీట్లు అమ్ముకున్నారంటూ విమర్శించారు. వీటన్నింటి నేపథ్యంలో, వెంకన్నపై మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు.