శివారెడ్డి మిమిక్రీ నా ప్రాణాలను కాపాడింది: సింగర్ మాళవిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శివారెడ్డి మిమిక్రీ నా ప్రాణాలను కాపాడింది: సింగర్ మాళవిక

  • ఒక వ్యక్తి తరచూ కాల్స్ చేసేవాడు 
  • అదే పనిగా మెస్సేజ్ లు పెట్టేవాడు
  • శివారెడ్డి వాయిస్ మార్చి ఫోన్లోనే ఆ వ్యక్తికి క్లాస్ పీకాడు
చిన్నతనంలోనే సింగర్ గా ప్రశంసలు అందుకున్న మాళవిక .. ఆ తరువాత పలు చిత్రాల్లో పాటలు పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తనకి ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గురించి చెప్పుకొచ్చారు. "నేను వరుసగా సినిమాల్లో పాడుతూ బిజీగా వున్న రోజుల్లో ఒక వ్యక్తి తరచూ మా ఇంటికి కాల్ చేసేవాడు. ఉదయం .. సాయంత్రం .. రాత్రి మెస్సేజ్ లు పెట్టేవాడు. ఆయన ఎవరో తెలియకపోయినా .. పెద్దగా ఇబ్బంది లేదు కదా అని ఊరుకున్నాము.

ఒకసారి నేను .. శివారెడ్డి .. గీతామాధురి .. అభినయ కృష్ణ కలిసి ఒక ఈవెంట్ కి వెళ్లాము. అప్పుడు ఆ వ్యక్తి ఒక మెస్సేజ్ పెట్టాడు .. చనిపోయిన కొంతమంది సెలబ్రిటీల జాబితాలో నా పేరు చేర్చి .. డెత్ డే అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టాడు. దాంతో నేను నాతో వున్న శివారెడ్డి .. గీతామాధురి వాళ్లకు చెప్పాను. దాంతో శివారెడ్డి తన ఫోన్ నుంచి అవతలి వ్యక్తికి కాల్ చేసి .. డీఎస్పీ నంటూ వాయిస్ మార్చి మాట్లాడాడు. ఇంకోసారి మాళవికను ఇబ్బంది పెడితే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించాడు. అంతే, ఆ రోజు నుంచి కాల్స్ గానీ .. మెస్సేజ్ లు గానీ లేవు. శివారెడ్డి మిమిక్రీ పెద్ద ఇబ్బంది నుంచి నన్ను బయటపడేసింది" అని చెప్పుకొచ్చింది.
malavika

More Telugu News