తెరపైకి సైఫ్ .. కరీనా కపూర్ తనయుడు తైమూర్
- కరీనా నాయికగా 'గుడ్ న్యూస్' మూవీ
- సెప్టెంబర్ 6వ తేదీన భారీస్థాయి విడుదల
- ఈ సినిమాతో 'తైమూర్' పరిచయం
ముద్దుగా .. బొద్దుగా వుండే ఈ కుర్రాడు త్వరలో తెరపై కనిపించనున్నాడు .. అదీ తన తల్లి నటించే సినిమాలో కావడం విశేషం. రాజ్ మెహతా దర్శకత్వంలో అక్షయ్ కుమార్ - కరీనా జంటగా నటిస్తోన్న 'గుడ్ న్యూస్' సినిమాలో 10 నిమిషాల పాటు తైమూర్ కనిపించనున్నాడు. ఈ కుర్రాడికి సంబంధించిన షూటింగును రీసెంట్ గా పూర్తి చేశారట. తైమూర్ ప్రధాన ఆకర్షణగా నిలిచే ఈ సినిమాను, సెప్టెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నారు.