పోలీసు అధికారిని కొట్టిన నటి రూహీ సింగ్... కేసు నమోదు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసు అధికారిని కొట్టిన నటి రూహీ సింగ్... కేసు నమోదు!

  • మార్చి 31 రాత్రి ఘటన
  • మందు కొట్టి వాహనం నడిపి యాక్సిడెంట్
  • ప్రశ్నించిన పోలీసును కొట్టిన నటి
ప్రముఖ మోడల్, పలు టీవీ దారావాహికల్లో నటించిన నటి రూహీ సింగ్ పై పోలీసు కేసు రిజిస్టర్ అయింది. మార్చి 31వ తేదీ రాత్రి, ముంబైలోని బాంద్రా ప్రాంతంలో మరో ఇద్దరితో కలిసి పూటుగా తాగిన ఆమె, విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారిపై చేయిచేసుకుంది. ఈ ఘటన లింకింగ్ రోడ్డులో జరిగింది. మందు కొట్టి వెళుతున్న ఆమె కారు యాక్సిడెంట్ కు కారణంకాగా, ప్రశ్నించిన పోలీసును ఆమె కొట్టినట్టు తెలుస్తోంది.

దీనిపై ముంబై పశ్చిమ రీజియన్ అదనపు కమిషనర్ మనోజ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, శాంతాక్రజ్ పోలీసులు ఆమెను పరీక్షిస్తే, మద్యం తాగినట్టు తెలిసింది. ఆమె రక్త నమూనాలను సేకరించి, ఇంటికి పంపాము. కేసు విచారణ కొనసాగుతోంది అని అన్నారు. రూహీ సిన్హా క్యాలెండర్ గర్ల్స్, ది వరల్డ్ బిఫోర్ హర్, ఇష్క్ ఫరెవర్, స్పాట్ లైట్ 2 తదితర చిత్రాల్లోనూ నటించింది.
Ruhi Singh
Mumbai
Actress
police
Case

More Telugu News