ఈ పైత్యమేంది 'మందలదిరి' లోకేశ్ బాబూ?: కన్నా సెటైర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ పైత్యమేంది 'మందలదిరి' లోకేశ్ బాబూ?: కన్నా సెటైర్

  • మీ నాన్న బాహుబలా?
  • "తెలివి అనే నీ కత్తి"తో పొడిచే "కట్టప్ప"నువ్వే
  • ట్విట్టర్ లో కన్నా లక్ష్మీనారాయణ
నిన్న ప్రధాని మోదీ ఏ క్షణాన చంద్రబాబును 'బాహుబలి' విలన్ భల్లాలదేవుడితో పోల్చారోగానీ, ఆ క్షణం నుంచి బాహుబలి పాత్రలు నాయకుల విమర్శల్లోకి వచ్చేశాయి. ఆ వెంటనే జగన్ ను భల్లాలదేవుడిగా, మోదీని బిజ్జల దేవుడిగా చంద్రబాబు పోల్చగా, కాలకేయుడితోనూ, భల్లాలదేవుడితోనూ మోదీని పోల్చుతూ లోకేశ్ ట్వీట్లు చేశారు.

ఇక తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, లోకేశ్ ను టార్గెట్ చేసుకుని ట్విట్టర్ లో సెటైర్లు వేశారు. "నువ్వు రాయించిన పైత్యం నీ లాగే ఉంది ''మందలదిరి'' లోకేష్ బాబు. ఒక వేళ నువ్వు అన్నట్లు మీ నాన్న 'బాహుబలి' ఐతే మీ నాన్నని "తెలివి అనే నీ కత్తి"తో పొడిచే "కట్టప్ప"నువ్వే. నీ దెబ్బకి తెలుగుదేశానికి ఏప్రిల్ 11న 'డెంగ్యూ' (నువ్వు పలికిన పదం రాయలేను) వస్తుంది" అని అన్నారు.



Lokesh
Kanna Lakshminarayana

More Telugu News