వైసీపీని 25 స్థానాల్లో గెలిపిస్తే ప్రత్యేక హోదాను ఆపడం ఎవరి తరం కాదు: జగన్
- బాబు దిగిపోతేనే ఉద్యోగాలు
- అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ
- గ్రామానికో సచివాలయం
వైసీపీ అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీతో పాటు పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలిచ్చే విధంగా చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి ఓ సచివాలయం ఏర్పాటు చేసి, వాటిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు. బాబు సీఎం పదవి నుంచి దిగిపోతేనే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలొస్తాయన్నారు.