ప్రధాని పదవికి అర్హుల జాబితాను రూపొందిస్తే అందులో కేసీఆర్ పేరు కచ్చితంగా ఉంటుంది: అసదుద్దీన్
- ప్రధాని పదవికి నేను కేసీఆర్ను ఎన్నుకుంటా
- కేసీఆర్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా
- భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్న నేత కేసీఆర్
ఎన్నికల తరువాత ప్రాంతీయ పార్టీలే అధికారాన్ని చేపడతాయన్న కేసీఆర్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. ఒకే నాణేనికి రెండు ముఖాల వంటివి, బీజేపీ, కాంగ్రెస్ అని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు పరిపాలనా కాలంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని బాగా అర్థం చేసుకున్న నేతగా కేసీఆర్ను అభివర్ణించారు.