Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొన్ని సన్నివేశాలు చూస్తూ లక్ష్మీపార్వతి ఏడ్చేశారు: 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో ఎన్టీఆర్ పాత్రధారి విజయ్ కుమార్

  • మొదటి నుంచి నాకు నాటకాలు అంటే ఇష్టం 
  • అప్పట్లో ఏఎన్నార్ నన్ను మెచ్చుకున్నారు
  • ఎన్టీఆర్ గా చేసింది నేనే అని లక్ష్మీపార్వతిగారికి చెప్పాను    
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో ఎన్టీ రామారావు పాత్రలో విజయ్ కుమార్ ప్రేక్షకులను మెప్పించారు. ఎన్టీ రామారావు హావభావాలను అద్భుతంగా పలికిస్తూ అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు.

"మొదటి నుంచి కూడా నాకు నాటకాలు వేయడమంటే ఇష్టం. ఒకసారి నా నాటకం చూసి అక్కినేని నాగేశ్వరరావు గారు అభినందించారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో అవకాశం రావడానికి నాకుగల నాటకానుభవమే కారణం. రామానాయుడు స్టూడియోలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' షోను లక్ష్మీపార్వతిగారి కోసం వేశారు. ఆ సమయంలో నేను ఆమె వెనుక సీట్లోనే కూర్చున్నాను. ఎన్టీఆర్ గారి పాత్రను పోషించింది నేనే అని చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయారు .. అభినందించారు. తెరపై కొన్ని సన్నివేశాలు వచ్చినప్పుడు ఆమె ఏడ్చేశారు. అవి నిజం కనుకనే కదా ఆమెకి అంతగా బాధ కలిగిందనిపించింది" అని చెప్పుకొచ్చారు.
vijay kumar

More Telugu News