పెద్ద హీరోయిన్లతో పనిచేశాను, కానీ శృతిహాసన్ తో పోరాడాల్సి వచ్చింది: 'పీవీపీ' వరప్రసాద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెద్ద హీరోయిన్లతో పనిచేశాను, కానీ శృతిహాసన్ తో పోరాడాల్సి వచ్చింది: 'పీవీపీ' వరప్రసాద్

  • చాలా ఇబ్బంది పెట్టింది
  • షూటింగ్ వదిలేసి వెళ్లిపోయింది
  • పోరాడి మరీ అడ్వాన్స్ వెనక్కి తీసుకున్నాను
విజయవాడ లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న 'పీవీపీ' వరప్రసాద్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవలకాలంలో తనపై ప్రధానంగా వినిపిస్తున్న శృతిహాసన్ వివాదం గురించి మాట్లాడారు. తాను సినీ ఇండస్ట్రీలో అనేకమంది అగ్రశ్రేణి కథానాయికలతో పనిచేశానని, కానీ ఎవరితోనూ రాని ఇబ్బంది శృతి హాసన్ విషయంలో వచ్చిందని చెప్పారు. శృతి హాసన్ ఓ చిత్రం కోసం అడ్వాన్స్ తీసుకుని షూటింగ్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయిందని వెల్లడించారు. ఓ నిర్మాతగా శృతి హాసన్ తో పోరాడి మరీ అడ్వాన్స్ వెనక్కి తీసుకున్నానని వివరించారు. అంతేతప్ప, ఆమె పట్ల తాను బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డానన్నది అవాస్తవమని అన్నారు. ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లో తనపై ఎలాంటి వివాదాలు లేవని, తనమీద సీబీఐ చార్జ్ షీట్లు ఏమీ లేవని వెల్లడించారు.
PVP
YSRCP
Vijayawada

More Telugu News