ధనుశ్ సినిమా స్ఫూర్తితో నితిన్ మూవీ?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధనుశ్ సినిమా స్ఫూర్తితో నితిన్ మూవీ?

  • తమిళంలో హిట్ కొట్టిన 'వడ చెన్నై'
  • అదే తరహాలో రూపొందనున్న 'పవర్ పేట'
  • ఏలూరు 'పవర్ పేట' నేపథ్యంలో సాగే కథ  
తెలుగులోని యువ కథానాయకులతో నితిన్ తన పోటీని కొనసాగిస్తున్నాడు. పరాజయాలు ఎదురవుతున్నా విజయాలను అందుకోవాలనే పట్టుదలతో ముందుకు వెళుతున్నాడు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా, దర్శకుడు కృష్ణ చైతన్యతో ఒక సినిమా చేయనున్నట్టు చెప్పాడు. ఈ సినిమాకి 'పవర్ పేట' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా వార్తలు వచ్చాయి.

తమిళంలో ధనుశ్ చేసిన 'వడ చెన్నై' స్పూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. చెన్నైలో రౌడీయిజానికి కేరాఫ్ అడ్రెస్ అయిన 'వడ చెన్నై' అనే ప్రాంతంలో ధనుశ్ సినిమా రూపొంది సక్సెస్ అయింది. అలాగే ఏలూరులోని 'పవర్ పేట' ప్రాంతం నేపథ్యంలో నితిన్ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాను మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నారు. 'పవర్ పేట' తరువాత సీక్వెల్ గా మరో రెండు భాగాలు రూపొందుతాయన్న మాట. ఇలా సీక్వెల్స్ గురించి కూడా ముందుగానే చెప్పడం విశేషం.
dhanush
nithin

More Telugu News