నాన్న వల్లనే రాజకీయాలపై ఆసక్తి ఏర్పడింది: శ్రుతిహాసన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాన్న వల్లనే రాజకీయాలపై ఆసక్తి ఏర్పడింది: శ్రుతిహాసన్

  • రాజకీయాల్లోకి నాన్న రావలసిన అవసరం వుంది
  • సమాజంలోని సమస్యల పట్ల ఆయనకు అవగాహన వుంది
  • నాన్నకు సాయపడాలనుకుంటున్నాను  
తెలుగు .. తమిళ .. హిందీ భాషా చిత్రాల్లో కథానాయికగా మెరిసిన శ్రుతిహాసన్, నటన పరంగా .. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. తెలుగు .. తమిళ భాషల్లో అగ్రస్థానానికి చేరుకున్న ఆమె, ఆ తరువాత ప్రేమలో పడి కెరియర్ పై అంతగా దృష్టి పెట్టలేదు. ఈ కారణంగానే అభిమానులకు .. ఆమెకి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. మళ్లీ సినిమాలపై దృష్టి పెడుతోన్న ఆమె, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజకీయాల గురించి ప్రస్తావించింది.

"మా నాన్నకి సమాజంపై అవగాహన ఎక్కువ. సమాజంలోని సమస్యలు .. పరిస్థితుల గురించి ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిపై స్పందిస్తూ వుంటారు. ఆయన సినిమాల్లోనూ సామాజిక సందేశం కనిపిస్తుంది. ప్రజలకు ఏం కావాలి? వాటిని ఎలా సాధించాలనే విషయంలో ఆయనకు స్పష్టమైన ఆలోచన వుంది. అలాంటి నాన్న రాజకీయాల్లోకి రావలసిన అవసరం ఎంతైనా వుంది. ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టేంతవరకూ నాకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు అవగాహన పెంచుకుని ఆయనకు సహకరించాలని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది.
sruthi haasan

More Telugu News