ఇంకో పెళ్లి చేసుకుని కట్నం డబ్బులతో ఇస్తారా?: పవన్ కల్యాణ్ పై కేఏ పాల్

  • అన్నీ చేస్తామని అంటున్న పవన్ కు డబ్బెక్కడిది?
  • జగన్ కు ఓటేస్తే మోదీ, కేసీఆర్ ఖాతాలోకే
  • తనను చూస్తే కేసీఆర్ కు భయమన్న పాల్
ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తాం, అన్నీ ఇస్తాం అంటున్న పవన్ కల్యాణ్ ఎలా ఇస్తారని ప్రశ్నించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్... ఎవరినైనా ధనవంతురాలిని పెళ్లి చేసుకుని ఆ వచ్చే కట్నం డబ్బులు తెచ్చి ఇస్తారా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, జనసేనపై విమర్శలు గుప్పించారు. ఓటేస్తే గుండు గీయించే కాపుకు ఓటేస్తారా? అని ప్రశ్నించారు. జగన్ కు ఓటు వేస్తే, అది మోదీ, కేసీఆర్ ఖాతాలోకి వెళుతుందని అన్న ఆయన, తనను చూస్తే కేసీఆర్ భయంతో పారిపోతారని, ఆయన ముక్కును పిండే శక్తి తనకుందని, కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా ఉన్న నేతను తాను మాత్రమేనని అన్నారు.
Go Back to Shorts
KA Paul
Bhimavaram
Pawan Kalyan
Jana Sena
Jagan
KCR

More Telugu News