'96' రీమేక్ విషయంలో ఆలోచనలో పడిన దిల్ రాజు .. కారణం అదేనట
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'96' రీమేక్ విషయంలో ఆలోచనలో పడిన దిల్ రాజు .. కారణం అదేనట

  • తమిళంలో హిట్ కొట్టిన '96'
  • తెలుగు రీమేక్ కి సన్నాహకాలు 
  • క్లైమాక్స్ లో మార్పులపై కసరత్తు  
తమిళంలో ఇటీవల కాలంలో వచ్చిన '96' మూవీ భారీ విజయాన్ని అందుకుంది. వైవిధ్యభరితమైన కథా చిత్రంగా ప్రేక్షకులచే ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా చూసిన వెంటనే .. తెలుగులో నిర్మించాలనే ఉద్దేశంతో రీమేక్ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. శర్వానంద్ .. సమంత జంటగా ఈ సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. తమిళంలో '96' మూవీని తెరకెక్కించిన దర్శకుడికే .. తెలుగు రీమేక్ కి దర్శకత్వం వహించే బాధ్యతను అప్పగించారు.

అయితే రీమేక్ క్లైమాక్స్ ను మార్చమని దిల్ రాజు చెప్పారట. తమిళంలో .. గెట్ టు గెదర్ పేరుతో కలిసిన ప్రేమికులు ఒక రాత్రంతా ఎమోషనల్ గా గడుపుతారు. మరునాడు ఉదయం నాయిక విమానంలో తన భర్త దగ్గరికి వెళ్లిపోతుంది. ఆమె ప్రేమికుడు కూడా సూట్ కేసు సర్దుకుంటూ ఉండగా శుభం కార్డు పడుతుంది. ఈ క్లైమాక్స్ తెలుగు ప్రేక్షకులకు ఎక్కదని భావించిన దిల్ రాజు .. మార్పులు చేయిద్దామని చూస్తుంటే కథ కుదరడం లేదట. నెల రోజులు గడిచినా క్లైమాక్స్ విషయంలో సంతృప్తికరమైన మార్పులు చేయలేకపోవడంతో దిల్ రాజు ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు.
sharwanad
samanta

More Telugu News