Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అఖిల్ నాలుగవ సినిమా సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్

  • 'బొమ్మరిల్లు' భాస్కర్ తో అఖిల్
  •  లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 
  • త్వరలోనే సెట్స్ పైకి    
అఖిల్ అభిమానులంతా కూడా ఆయన తదుపరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో అఖిల్ తప్పకుండా హిట్ కొట్టాలనే ఆశాభావంతో వాళ్లంతా వున్నారు. అఖిల్ కూడా 'బొమ్మరిల్లు' భాస్కర్ తో తన సినిమా విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు.

గత సినిమాల్లోని లోపాలను సవరించుకుంటూ అఖిల్ వెళుతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. యూత్ కి .. మాస్ ఆడియన్స్ కు ఏ తరహా బీట్స్ ఇష్టమో దేవిశ్రీకి బాగా తెలుసు. అందువలన కథాపరంగా ఈ ప్రాజెక్టుకు ఆయననే తీసుకోవాలనే ఉద్దేశంతో గీతా ఆర్ట్స్ వారు ఉన్నారట. సంప్రదింపులు జరుగుతున్నాయని .. దాదాపు దేవిశ్రీ ప్రసాద్ ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. ఇక అఖిల్ సక్సెస్ లో దేవిశ్రీ ఏ స్థాయి పాత్రను పోషిస్తాడో చూడాలి.
akhil
bhaskar

More Telugu News