చంద్రబాబుతో 40 ఏళ్ల పరిచయం ఉంది... మీకన్నా నాకే బాగా తెలుసు: మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు!
- అణువణువునా అబద్ధాలు, కుట్రలు
- కన్యాదానం చేసిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి
- వాడుకుని కరివేపాకులా పక్కన పడేయటమే బాబు నైజం
ఆనాడు తాను కూడా చంద్రబాబును కలిశానని, పార్టీలో లక్ష్మీ పార్వతి ప్రమేయాన్ని తగ్గించేందుకు, ఎన్టీఆర్ నుంచి పదవిని తీసుకుని, తిరిగి ఒకటి రెండు రోజుల్లో ఆయనకే అధికారాన్ని ఇద్దామని తనకు చంద్రబాబు చెప్పాడని అన్నారు. అన్న ఎన్టీఆర్ పై చెప్పులు వేయించడం వాస్తవమని, భగవంతుని సాక్షిగా కళ్లారా తాను చూశానని మోహన్ బాబు చెప్పారు. అది చంద్రబాబు నైజం. ఆ తరువాత కూడా తాను చంద్రబాబును గెలిపించాలని ప్రచారం చేశానని, ఆపై తనను కరివేపాకులా తీసి పక్కన పడేశారని ఆరోపించారు. ఇప్పుడున్నది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం కాదని, లాక్కున్న తెలుగుదేశం పార్టీ అని ఆరోపించారు. ఇది ప్రజలకు ఎవరు చెప్పినా ఎక్కడం లేదని, ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేయడంతో పాటు ఆయన కుటుంబాన్ని వాడుకుని పక్కన బెట్టారని, కోట్లాది మంది అభిమానులున్న జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ అలాగే జరిగిందని ఆరోపించారు. ఈమధ్య కూడా తనకు కూతురితో సమానమైన హరికృష్ణ కుమార్తె సుహాసిని విషయంలోనూ చంద్రబాబు మోసం చేశారని అన్నారు.