Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉబెర్ కారనుకుని ఎక్కితే... కాలేజీ విద్యార్థిని దారుణ హత్య!

  • సౌత్ కరోలినాలో ఘటన
  • మద్యం తాగి కారెక్కిన సమంతా జోసెఫ్ సన్
  • తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు
తాను బుక్ చేసుకున్న ఉబెర్ కారు వచ్చిందనుకుని, పక్కనే ఆగిన కారును ఎక్కిన ఓ కాలేజీ విద్యార్థిని దారుణ హత్యకు గురైన ఘటన సౌత్ కరోలినాలో జరిగింది. కొలంబియా పోలీస్ చీఫ్ విలియమ్ హాల్ బ్రూక్ వెల్లడించిన వివరాల ప్రకారం, సౌత్ కరోలినా యూనివర్శిటీలో చదువుకుంటున్న సమంతా జోసెఫ్ సన్ (21) అనే యువతి, ఫైవ్ పాయింట్స్ బార్ లో మద్యం తాగి, ఆపై బయటకు వచ్చింది. ఆపై 12 గంటల తరువాత, తమ స్నేహితురాలు కనిపించడం లేదని సమంత స్నేహితుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కదిలారు. ఉబెర్ రైడ్ అనుకుంటూ, ఆమె ఓ కారు ఎక్కగా, నథానియేల్ రోలాండ్ (24) అనే యువకుడు, ఆమెను తీసుకెళ్లి హత్య చేశాడని తేల్చారు. నథానియేల్ కారు ఆమె పక్కనే ఆగగా, ఆమె డోర్ తీసుకుని ఎక్కిందని, ఆపై ఆమె మృతదేహం శివారు ప్రాంతాల్లో కనిపించిందని హాల్ బ్రూక్ తెలిపారు. ఈ హత్య తమ మనసులను కలచివేసిందని ఆయన అన్నారు. కారులోనే ఆమెను హతమార్చి, ఆపై మృతదేహాన్ని వదిలి వెళ్లాడని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు.
South Carolina
Murder
Student
Uber

More Telugu News