Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సమంత మా ఇంటికి తొలిసారి వస్తే కుక్క కూడా పరిగెత్తుకుంటూ వెళ్లింది: నాగార్జున ఆశ్చర్యం

  • చైతూ, సామ్ నిజంగానే మాయ చేశారు
  • మనం షూటింగ్ లో కూడా ఏమీ ఎరగనట్టే ఉన్నారు
  • 'మజిలీ' ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాగ్
మజిలీ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో అక్కినేని నాగచైతన్యతో పాటు హీరోయిన్ సమంత, నాగార్జున, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ, నాగచైతన్య, సమంతల ప్రేమ వ్యవహారం గురించి అందరితో పంచుకున్నారు. 'ఏ మాయ చేశావే' సినిమా టైమ్ లో వారిద్దరి జోడీ బాగుందని మాత్రమే అనుకున్నానని, మనం చిత్రం చేసినప్పుడు కూడా ఎలాంటి అనుమానం రాలేదని చెప్పారు. ఓసారి సమంత తమ ఇంటికి వస్తే కుక్క కూడా పరిగెత్తుకుంటూ ఆమె వద్దకు వెళ్లిందని, దీనికి సమంత ఎలా తెలుసు? అని తానెంతో ఆశ్చర్యపోయిన క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

అంతకుముందు కూడా చై, సామ్ మధ్య రొమాన్స్ జరుగుతోందని అనుమానం వచ్చే ఒక్క సంఘటన కూడా జరగలేదని, అంత బాగా మేనేజ్ చేశారని తెలిపారు. నిజంగానే మాయ చేశారని నాగ్ పేర్కొన్నారు. ఇక, 'మజిలీ' చిత్రం గురించి చెబుతూ, ట్రైలర్ చూసి ఎంతో ఎమోషనల్ అయ్యానని, సినిమా చూస్తే ఏమైపోతానో అంటూ వ్యాఖ్యానించారు.
Nagarjuna
majili
Tollywood

More Telugu News