పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ‘2.0’ హీరోయిన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ‘2.0’ హీరోయిన్!

  • అందరికీ అరిచి మరీ చెప్పాలనుకుంటున్నా
  • అంతకు మించిన రోజు మరొకటి ఉండదు
  • అందరి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నా
ప్రముఖ నటి, ‘2.0’ సినిమా హీరోయిన్ అమీ జాక్సన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అమీ జాక్సన్ కొంతకాలంగా బ్రిటన్‌కుచెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో డేటింగ్‌లో ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరికీ జాంబియాలో నిశ్చితార్థం అయింది. అయితే పెళ్లి మాత్రం ఇంకా చేసుకోలేదు. కానీ తాను తల్లి కాబోతున్నానంటూ, ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి మాతృదినోత్సవానికి మించిన సరైన రోజు మరొకటి లేదని వెల్లడించింది. బ్రిటన్ లో నేడు మదర్స్ డే కావడంతో అమీ ఈ విషయం అందరితో పంచుకుంది.

కాబోయే భర్తతో దిగిన ఫోటోను షేర్ చేసిన అమీ, ‘‘మీ అందరికీ ఈ విషయాన్ని అరిచి మరీ చెప్పాలని ఎదురుచూస్తున్నాను. ఈ విషయం చెప్పేందుకు మాతృదినోత్సవానికి మించిన సరైన రోజు మరొకటి ఉండదు. ఈ ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను చూసేందుకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం’’ అని పోస్ట్ పెట్టింది. పోస్ట్ చూసిన నెటిజన్లు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Amee Jackson
Britain
George Payonato
New Year
Jambia

More Telugu News