‘మీ భవిష్యత్ నా బాధ్యత’ అంటూ దొంగబాబు చెబుతున్న మాటలు నమ్మొద్దు: వైఎస్ షర్మిళ
- బాబు ఇచ్చే ఎంగిలి మెతుకులకు మీరు మోసపోవద్దు
- ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు
- బాబు, మోదీ జోడి కలిసి ‘హోదా’ రాకుండా చేశారు
ఏపీకి రావాల్సిన ప్రత్యేకహోదాను చంద్రబాబు, మోదీ జోడి కలిసి ఆ ‘హోదా’ రాకుండా చేశారని విమర్శించారు. మొదట ప్రత్యేక హోదా, ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలన్న చంద్రబాబు, ఇప్పుడేమో మళ్లీ ‘హోదా’నే కావాలంటూ నాటకాలాడుతున్నారని, చంద్రబాబుది రోజుకో మాట, పూటకో వేషమని దుయ్యబట్టారు. ‘మీ భవిష్యత్ నా బాధ్యత’ అంటూ దొంగబాబు చెబుతున్న మాటలను నమ్మొద్దంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికలు పిల్లల భవిష్యత్ కు, ఏపీ అభివృద్ధికి చాలా కీలకమని, వైసీపీని గెలిపించి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని అన్నారు.