బన్నీతో ఈ ఏడాది సుకుమార్ సినిమా లేనట్టేనట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బన్నీతో ఈ ఏడాది సుకుమార్ సినిమా లేనట్టేనట!

  • త్రివిక్రమ్ తో సెట్స్ పైకి అల్లు అర్జున్ 
  • తదుపరి సినిమా వేణు శ్రీరామ్ తో
  •  వెయిటింగులో సుకుమార్  
చరణ్ కి 'రంగస్థలం'తో సంచలన విజయాన్ని అందించిన సుకుమార్, ఆ తరువాత సినిమాను మహేశ్ బాబుతో చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు సెట్ కాలేదు. దాంతో అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి సుకుమార్ రంగంలోకి దిగాడు. త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేయనున్న సినిమా పూర్తయిన వెంటనే ఆయనతో కలిసి సెట్స్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే అనుకోకుండా మధ్యలోకి వేణు శ్రీరామ్ ప్రాజెక్టు వచ్చి చేరింది.

వేణు శ్రీరామ్ వినిపించిన కథ మరింత ఆసక్తికరంగా అనిపించడంతో, సుకుమార్ ప్రాజెక్టు కంటే ముందుగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ వున్నాడని అంటున్నారు. ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు కావడంతో, ఆయన కూడా ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలోనే వున్నాడని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఈ ఏడాది సుకుమార్ సినిమా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
allu arjun
sukumar

More Telugu News