వారసత్వం అనే మాటే నాకు నచ్చదు .. కష్టపడి పైకిరావాలి: కంగనా రనౌత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వారసత్వం అనే మాటే నాకు నచ్చదు .. కష్టపడి పైకిరావాలి: కంగనా రనౌత్

  • నా పిల్లలను ఇండస్ట్రీకి తీసుకురాను
  • నా పేరు చెప్పుకుని నా పిల్లలు అవకాశాలు సంపాదించకూడదు
  • సిఫార్సులతో సాధించడం నాకు నచ్చదు
బాలీవుడ్లో స్టార్ హీరోలపై .. బడా దర్శక నిర్మాతలపై కామెంట్స్ చేస్తూ అక్కడ నెగ్గుకు రావడం అంత ఆషామాషీ విషయమేం కాదు. అలాంటిది కంగన రనౌత్ మాత్రం అవతలివారి స్టేటస్ ఎంతటిదైనా లెక్కచేయదు. తాను చెప్పదలచుకున్నది సూటిగా చెప్పేస్తుంది .. చేయదలచుకున్నది చేసేస్తుంది.

తాజాగా ఆమె వారసత్వం గురించిన ప్రస్తావన తెచ్చింది. "వారసత్వం అనే మాటే నాకు నచ్చదు. నా పిల్లలను సముద్రంలోనైనా వేస్తాను గానీ .. నా వారసులుగా మాత్రం వాళ్లను ఇండస్ట్రీకి తీసుకురాను. వాళ్లు ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో రాణించేలా శిక్షణ ఇప్పిస్తాను. ఒక తల్లిగా వాళ్లకు సహకరిస్తానేగానీ .. దగ్గరే వుంటూ వాళ్ల కెరియర్ ను తీర్చిదిద్దుతూ కూర్చోను.

నా వారసులుగా వాళ్ల పరిచయాలు వుండవు .. అందుకు నా సిఫార్సులు వుండవు. నా తమ్ముడు జాబ్ కోసం చాలా కాలంగా ట్రై చేస్తున్నాడు. అయినా నేను అతనికి ఎలాంటి సిఫార్స్ చేయదలచుకోలేదు. కష్టపడి సాధించడంలోనే ఆనందం వుంటుంది .. ఆత్మ సంతృప్తి ఉంటుంది" అని చెప్పుకొచ్చింది. వారసత్వంతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్లోని కొంతమంది హీరో హీరోయిన్లను టార్గెట్ చేస్తూ కంగనా ఈ వ్యాఖ్యలు చేసిందనే టాక్ అక్కడ బలంగా వినిపిస్తోంది.
kangana

More Telugu News