సూర్యకి విసుగులేదు .. విరామం లేదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సూర్యకి విసుగులేదు .. విరామం లేదు

  • సూర్య తాజా చిత్రంగా 'ఎన్జీకే'
  • షూటింగు దశలో 'కాప్పన్'
  • తదుపరి సినిమా సుధ కొంగరతో  
జయాపజయాలను గురించి పెద్దగా పట్టించుకోకుండా సూర్య వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. తన నుంచి అభిమానులు ఆశించే యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతున్నాడు. ఒక సినిమా పూర్తవుతూ ఉండగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఎన్జీకే' సిద్ధమవుతోంది.

ఆ తరువాత సినిమాగా 'కాప్పన్' షూటింగు జరుగుతోంది. ఆగస్టు 30వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే దర్శకురాలు సుధ కొంగరకి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 'గురు' సినిమాతో దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్న ఆమె, సూర్యతో సినిమాకి సన్నాహాలు చేసుకుంటోంది. వచ్చేనెలలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారనేది తాజా సమాచారం. మొత్తానికి సూర్య విసుగు .. విరామం లేకుండా వరుస సినిమాలతో తన జోరును కొనసాగిస్తూనే వున్నాడు.
surya

More Telugu News