దేశాన్ని రక్షిస్తావా?.. ముందు రాష్ట్రంలో గెలిచి చూపించు: చంద్రబాబుకు బీజేపీ నేత రాంమాధవ్ సవాల్
- దేశ ప్రజలంతా మోదీ వెంటే.. మళ్లీ ప్రధాని ఆయనే
- ఏపీలో అసమర్థ, అవినీతి, కుటుంబ పాలన
- పది సీట్లు కూడా దక్కించుకోలేని కేసీఆర్ ప్రధాని అవుతారట
మళ్లీ అధికారంలోకి వచ్చేది మోదీయేనని, దేశ ప్రజలంతా ఆయన వెంటే ఉన్నారని రాంమాధవ్ పేర్కొన్నారు. మోదీని తమ ప్రాంతం నుంచి పోటీ చేయాల్సిందిగా అన్ని ప్రాంతాల ప్రజలు కోరుతున్నారన్న ఆయన.. రాహుల్ ఎక్కడి నుంచి పోటీ చేస్తామంటే అక్కడి నుంచి వద్దని జనాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా రాంమాధవ్ విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పట్టుమని పదిసీట్లు కూడా దక్కించుకోలేని కేసీఆర్ ప్రధానిని అవుతానని చెప్పడం హాస్యాస్పదమేనన్నారు.