ఆ ఆఫర్ ఏదో లోకేశ్‌కే ఇవ్వండి.. చంద్రబాబుకు సూచించిన పవన్
- వైసీపీలో చేరిన ఎస్పీవై రెడ్డి తిరిగి రావాలని చంద్రబాబు పిలుపు
- వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్
- అదేదో లోకేశ్‌కే ఇచ్చుకోవాలన్న పవన్
తాను రాయలసీమ వ్యక్తిని కాకున్నా తనలోనూ సీమ పౌరుషం ఉందన్నారు. రాయలసీమలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని, తాము అధికారంలోకి వస్తే అలాంటి భయం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ పథకంగా ప్రకటిస్తామన్నారు. ఆదోని జామియా మసీదుకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తామని, రూ.100 కోట్లతో ఆదోని నుంచి కడప దర్గా వరకు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని జనసేనాని హామీ ఇచ్చారు.