పెండింగ్ లోవే కాదు, కావాలని పక్కన పెట్టిన పనులనూ పూర్తి చేస్తా: కరణం బలరాం హామీ
- చీరాలలో ఆమంచి వర్సెస్ కరణం బలరాం
- ఈ నియోజకవర్గంపై నాకు పూర్తి అవగాహన ఉంది
- ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నా
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చీరాల నియోజకవర్గం గురించి తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ఇక్కడి చేనేతలు, యాదవులు, ఎస్సీ, ఎస్టీలు, రైతాంగానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, పెండింగ్ లో ఉన్న పనులే కాకుండా, కావాలని పక్కన పెట్టిన పనులను కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఈ నియోజకవర్గంలో ఎలాంటి హడావుడి లేదని, ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని అన్నారు. టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్న హామీని కచ్చితంగా నెరవేరుస్తానని చెప్పారు.