పోసాని ఎలాంటివాడో నేను స్వయంగా చూశాను: అలీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోసాని ఎలాంటివాడో నేను స్వయంగా చూశాను: అలీ

  • నాయక్ తో భగవంతుడే బ్రేక్ ఇచ్చాడు
  • ఇంతమంది కమెడియన్లలో ఏ స్థానమో చెప్పలేం
  • చెప్పుడు మాటలు చెప్పడు
టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ సహనటుడు, రచయిత పోసాని కృష్ణమురళిపై తన అభిప్రాయాలు వెల్లడించారు. పోసాని తెరకెక్కిస్తున్న 'ముఖ్యమంత్రి గారు మీరు మాటిచ్చారు' సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమంలో అలీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు తెలిసిన పోసాని గురించి వివరించారు. పోసాని ఎంతోమందికి సాయం చేసినా ఎవరికీ చెప్పుకోడని అన్నారు. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పే రకం కాదని, షూటింగ్ కు వస్తే తన పని తాను చేసుకుపోయే రకం అని వెల్లడించారు.

పోసాని మంచి మనసుకు మెచ్చి ఆ భగవంతుడు నాయక్ చిత్రంతో బ్రేక్ ఇచ్చాడని, అక్కడ్నించి కమెడియన్ గా పోసాని ప్రస్థానం అందరికీ తెలిసిందేనన్నారు. అయితే ఇప్పుడున్న కమెడియన్లలో పోసాని స్థానం కంటే అతడి వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనదని అలీ స్పష్టం చేశారు. తాను నిర్మాతగా కొన్ని సినిమాలు చేసినప్పుడు కూడా డబ్బులేకపోతే ఉన్నదంతా అమ్ముకుని అయినా ఆర్టిస్టులకు చెల్లింపులు చేశాడే తప్ప ఏనాడూ ఒక్కరికి కూడా పారితోషికం ఎగ్గొట్టలేదని వెల్లడించారు. కాగా, అలీ, పోసాని ఇద్దరూ వైసీపీ నేతలన్న సంగతి తెలిసిందే.
Tollywood

More Telugu News