మీరు మంగళగిరి చూసుకోండి బాబోయ్ అంటున్నా చిట్టినాయుడికి ఎక్కడంలేదే!: విజయసాయిరెడ్డి వ్యంగ్యం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీరు మంగళగిరి చూసుకోండి బాబోయ్ అంటున్నా చిట్టినాయుడికి ఎక్కడంలేదే!: విజయసాయిరెడ్డి వ్యంగ్యం

  • వరుస ట్వీట్లు చేసిన వైసీపీ నేత
  • లోకేశ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు
  • లాజిక్ అర్థం చేసుకోలేకపోతున్నాడంటూ ఎద్దేవా
వైసీపీ నేతలందరిలోనూ కాస్త వ్యంగ్యం మేళవించి వ్యాఖ్యలు చేయడంలో విజయసాయిరెడ్డి దిట్ట అని చెప్పాలి! గత కొన్నాళ్లుగా ఆయన ట్విట్టర్ లో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ లపై ఎన్నో విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా లోకేశ్ పై తరచుగా వ్యంగ్యం ప్రదర్శించే ఆయన తాజాగా మరోసారి ట్వీట్లు చేశారు. మంగళగిరిలో ప్రచారం చేసిన తర్వాత రాబోయే 4 రోజుల్లో సుడిగాలి ప్రచారాలు చేయాలని నారా లోకేశ్ ఆరాటపడిపోతున్నాడని, కానీ ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల నుంచి లోకేశ్ కు ప్రతికూల స్పందన ఎదురవుతోందని విజయసాయి ట్వీట్ చేశారు.

కొందరు అభ్యర్థులు నేరుగా చెప్పలేక, మీరు మంగళగిరి చూసుకోండి చాలు అంటున్నా ఈ చిట్టినాయుడి పసిమెదడుకు లాజిక్ ఎక్కడం లేదే! అంటూ ట్విట్టర్ లో స్పందించారు. అంతకుముందు ఆయన మరో ట్వీట్ లో, లోకేశ్ కామెడీ ప్రసంగాలతో టీడీపీ నాయకులు బెంబేలెత్తిపోతున్నారని, లోకేశ్ మంగళగిరిలో ఉంటేనే మంచిదని వారు చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 9న పోలింగ్ ఉంటుందని అవగాహన లేకుండా చెప్పడం, బందరు పోర్టును కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఎత్తుకెళతారని వ్యాఖ్యానించడం గురించి నాయకులు చంద్రబాబుకు చెప్పినా ఫలితం శూన్యమని పేర్కొన్నారు.
YSRCP
Vijay Sai Reddy
Nara Lokesh
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News