ఏపీ ఎన్నికల బరిలో సినీ నటి సాయి సంజన
- న్యూజివీడు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న సంజన
- కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి.. విఫలం
- 2016లో మిస్ హైదరాబాదుగా ఎంపికైన సంజన
2016లో సంజన మిస్ హైదరాబాదుగా ఎంపికైంది. సినీపరిశ్రమలోకి వెళ్లిన తర్వాత జనజాగృతి అనే రాజకీయ పార్టీలో ఆమె చేరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఆమె ప్రయత్నించినా, ఆమెకు టికెట్ దక్కలేదు. దీంతో, స్వతంత్ర అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగారు. మాజీ మంత్రి, దివంగత పాలడుగు వెంకట్రావుకు ఆమె సమీప బంధువు.