పెద్దదొంగ మోదీ, చిన్నదొంగ కేసీఆర్: విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెద్దదొంగ మోదీ, చిన్నదొంగ కేసీఆర్: విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు

  • ఈవీఎంలను కేసీఆర్ ట్యాంపరింగ్ చేయించారు
  • ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు తగినబుద్ధి చెప్పాలి
  • రాహుల్ కు ఓ విజన్ ఉంది
సంగారెడ్డిలోని ఆర్సీ పురంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్పాయి కానీ, ఈవీఎంలను కేసీఆర్ ట్యాంపరింగ్ చేయించారని ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ కు ఓ విజన్ ఉందని, ఓ ప్రణాళికతో పనిచేస్తారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆమె విమర్శలు చేశారు. దేశంలో జీఎస్టీ వల్ల ఎవరికి లాభం ఉందని ప్రశ్నించారు. దేశాన్ని దోచుకుంటున్న పెద్దదొంగ మోదీ, తెలంగాణను దోచుకుంటున్న చిన్నదొంగ కేసీఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
Telangana
cm
kcr
pm
modi
vijayashanti

More Telugu News