Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నటుడిగా 16 యేళ్లు పూర్తిచేసుకున్న అల్లు అర్జున్

  • 'గంగోత్రి'తో కథానాయకుడిగా పరిచయం
  • స్టైలీష్ స్టార్ అనిపించుకోవడం వెనుక కృషి
  • తదుపరి సినిమా నిర్మాతల నుంచి అభినందనలు    
తెలుగు తెరకు 'గంగోత్రి' సినిమా ద్వారా హీరోగా అల్లు అర్జున్ పరిచయమయ్యాడు. ఆ తరువాత నటన పరంగా .. డైలాగ్స్ పరంగా .. డాన్స్ పరంగా .. తనని తాను మలుచుకుంటూ .. మార్చుకుంటూ ఆయన ముందుకుసాగాడు. ఆయన చేసిన నిరంతర కృషి కారణంగా 'స్టైలీష్ స్టార్' అనిపంచుకోవడానికీ .. స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. నటుడిగా ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుతో 16 యేళ్లు పూర్తయింది.

ప్రస్తుతం అల్లు అర్జున్ తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయడానికి సిద్ధమవుతున్నాడు. గీతా ఆర్ట్స్ వారితో కలిసి ఈ సినిమాను హారిక అండ్ హాసినివారు నిర్మిస్తున్నారు. నటుడిగా 16 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా  అల్లు అర్జున్ కి వాళ్లు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో ఆయన మరెన్నో విజయాలను అందుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ తో తాము చేయనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకోనుందనీ .. ఆ పనులు పూర్తికాగానే అన్ని వివరాలను తెలియజేస్తామని ఆయన అభిమానులకు కూడా క్లారిటీ ఇచ్చేశారు.
allu arjun

More Telugu News