హీరోగా మారుతోన్న సుడిగాలి సుధీర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోగా మారుతోన్న సుడిగాలి సుధీర్

  • 'జబర్దస్త్'తో మంచి క్రేజ్ 
  • కమెడియన్ గా వెండితెర వేషాలు
  •  తాజాగా ఓ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్    
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా పాప్యులర్ అయిన నటుల్లో సుడిగాలి సుధీర్ ఒకరు. 'జబర్దస్త్' తో వచ్చిన పాప్యులారిటీతో మరికొన్ని షోలు కూడా చేస్తూ బిజీ అయ్యాడు. అంతేకాదు వీలును బట్టి వెండితెరపై కూడా సందడి చేస్తూనే వున్నాడు. ఈ నేపథ్యంలోనే త్వరలో ఆయన హీరోగా ఒక సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. బాగా పేరున్న దర్శకుడే సుధీర్ హీరోగా ఈ సినిమా చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు.

గతంలోనే సుడిగాలి సుధీర్ హీరోగా ఒక చిన్న సినిమా నిర్మితమైందిగానీ, కొన్ని కారణాల వలన అది విడుదల కాలేదు. అప్పటి నుంచి హీరో వేషాలపై పెద్దగా ఆసక్తి చూపకుండా .. కమెడియన్ గానే చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సారి ఓ పేరున్న దర్శకుడే తనని సంప్రదించడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. చూడాలి .. సుడిగాలి సుధీర్ హీరోగా కూడా రాణిస్తాడేమో.
sudigali sudheer

More Telugu News