చైల్డ్ ఆర్టిస్ట్ గా నేను చేసిన 'కిట్టిగాడు' మంచి పేరు తెచ్చిపెట్టింది: నటుడు కృష్ణ కౌశిక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైల్డ్ ఆర్టిస్ట్ గా నేను చేసిన 'కిట్టిగాడు' మంచి పేరు తెచ్చిపెట్టింది: నటుడు కృష్ణ కౌశిక్

  • 'కిట్టిగాడు'తో కెరియర్ మొదలు 
  • ఆడిషన్స్ కి వెయ్యిమందికి పైగా వచ్చారు
  •  నేను సెలెక్ట్ కావడం అదృష్టం   
చైల్డ్ ఆర్టిస్ట్ గా కృష్ణకౌషిక్ కొన్ని సినిమాల్లో నటించాడు. ఆ తరువాత హీరోగా చాలా సీరియల్స్ లో నటించి, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. నటుడిగా తన కెరియర్ ఎలా మొదలైందనేది చెప్పాడు.

" అప్పట్లో ఇన్ని టీవీ చానల్స్ లేవు. దూరదర్శన్ లో సీరియల్స్ వచ్చేవి. ఆ సీరియల్స్ జనానికి బాగా గుర్తుండిపోయేవి. చెన్నైలో ఉండగా 'కిట్టిగాడు' సీరియల్ కి మెయిన్ రోల్ చేసే కుర్రాడు కావాలని పేపర్లో ప్రకటన వచ్చింది. నటన అంటే వున్న ఆసక్తి కారణంగా నేను ఆడిషన్స్ కి వెళ్లాను. సుహాసిని .. చారుహాసన్ .. దర్శకుడు చక్రవర్తి గారు కలిసి ఆడిషన్స్ నిర్వహించారు. వెయ్యిమందికి పైగా కుర్రాళ్లు వచ్చారు. వారం రోజులపాటు జరిగిన ఆడిషన్స్ తరువాత 'కిట్టిగాడు'గా నన్ను సెలెక్ట్ చేశారు. అలా నటుడిగా నా కెరియర్ మొదలైంది" అని చెప్పుకొచ్చాడు.
krishna kaushak

More Telugu News