కేసీఆర్ తో అంటకాగిన జగన్ కు ప్రజలే బుద్ధి చెబుతారు!: నారా లోకేశ్
- పోలవరాన్ని కేసీఆర్ అడ్డుకునేందుకు యత్నించారు
- ‘పసుపు-కుంకుమ’ తీసేసే జగన్ కు ఓటేయాలా?
- విశాఖ జిల్లా అరకులో నారా లోకేశ్ వ్యాఖ్య
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్ ఇకపై తన పేరును ‘కల్వకుంట్ల జగన్ మోదీ రెడ్డి’గా మార్చుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. ఏపీలో ‘పసుపు-కుంకుమ’ పథకాన్ని తీసేసే వ్యక్తికి ఓటేస్తారా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.