హైకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం ... పోలీసు అధికారుల బదిలీపై లంచ్‌మోషన్‌ పిటిషన్‌

  • ఎన్నికల విధులతో సంబంధం లేని వారిపై వేటు వేశారని ఫిర్యాదు
  • వివరణ కూడా కోరలేదని ప్రస్తావన
  • మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం
అనుకున్నట్టే రాష్ట్రంలోని పోలీసు అధికారులపై ఎన్నిక సంఘం వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రత్యర్థి వైసీపీ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని కనీసం వివరణ కూడా కోరకుండా అధికారులపై ఈసీ వేటు వేసిందని ఫిర్యాదు చేసింది. పైగా ఎన్నికల విధులతో సంబంధం లేని వారిని కూడా తప్పించిందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరగనుంది. పిటిషన్‌పై వాదనలు వినిపించాల్సిందిగా ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
Go Back to Shorts
EC
High Court
police officers

More Telugu News