ఇందిరా గాంధీ లాంటి ముక్కు ఉన్నంత మాత్రాన అధికారంలోకి రాలేరు!: ప్రియాంకపై కేంద్ర మంత్రి విమర్శలు

  • అలాగైతే చైనాలో ఇంటికొక అధ్యక్షుడు ఉంటారు
  • కేంద్ర మంత్రి మాన్ సుఖ్ మాండవీయ విమర్ళలు
  • మాండవీయ వ్యాఖ్యలను తప్పుపడుతున్న నెటిజన్లు
కేంద్ర మంత్రి మాన్ సుఖ్ మాండవీయ నోరు జారారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ లక్ష్యంగా విమర్శలు చేశారు. గుజరాత్ లోని ఆనంద్ లో జరిగిన ‘విజయ్ సంకల్ప్ యాత్ర’లో మాండవీయ మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ లాంటి ముక్కు ఉన్నంత మాత్రాన ప్రియాంకా గాంధీ అధికారంలోకి రాలేరని తెలిపారు. అలా జరిగే పనైతే చైనాలో ప్రతీ ఇంటి నుంచి ఓ అధ్యక్షుడు వస్తాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

‘ప్రియాంకా గాంధీకి తన నానమ్మ ఇందిరాగాంధీ లాంటి ముక్కు ఉందని అందరూ అంటున్నారు. మీరు మీ ముక్కు వల్ల అధికారంలోకి రాగలిగితే, చైనాలో ప్రతీ ఇంటి నుంచి ఓ అధ్యక్షుడు వస్తాడు కదా?’ అని చెప్పారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఢిల్లీలో టాప్-జీన్స్ వేసుకుని తిరిగే ప్రియాంక ఎన్నికల ప్రచారానికి రాగానే శారీ, సిందూరం ధరిస్తారని బీజేపీ నేత హరీశ్ ద్వివేదీ వ్యాఖ్యానించి ఇబ్బందుల్లో పడ్డారు.
Go Back to Shorts
India
Congress
BJP
priyanka gandhi
indira gandhi
Minister
mansukh mandaviya

More Telugu News