ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ కు చెంపపెట్టు: జీవన్ రెడ్డి
- టీఆర్ఎస్ కంచుకోటలో అఖండ విజయం సాధించిన జీవన్ రెడ్డి
- ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్న జీవన్
- ప్రజా గొంతుకనై మండలిలో పోరాడతానంటూ వ్యాఖ్య
ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై తాను పోరాడుతానని జీవన్ రెడ్డి చెప్పారు. తనపై నమ్మకముంచి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ప్రజాగొంతుకనై శాసనమండలిలో ప్రభుత్వ విధానాలపై అలుపెరుగని పోరాటం చేస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన గ్రూప్-1 మాజీ అధికారి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ పై జీవన్ రెడ్డి ఏకంగా 39,430 ఓట్ల తేడాతో గెలుపొంది, సంచలనానికి తెర తీశారు.