విజయాలకు దూరమైన రకుల్ .. అయినా ఆమె పారితోషికం 2 కోట్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయాలకు దూరమైన రకుల్ .. అయినా ఆమె పారితోషికం 2 కోట్లు

  • ఇటీవల వెనుక బడిన రకుల్ 
  • సక్సెస్ లు లేకపోవడమే కారణం
  • సీనియర్ హీరోయిన్ల కొరతవల్లనే డిమాండ్      
తెలుగులో చాలా వేగంగా అగ్రస్థానానికి చేరుకున్న కథానాయికల జాబితాలో రకుల్ కూడా కనిపిస్తుంది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసేసి విజయాలను అందుకుంది. గ్లామర్ పరంగా .. నటన పరంగా రకుల్ మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఎంత వేగంగా ఆమెను విజయాలు వరించాయో .. అంతే వేగంగా పరాజయాలు కూడా పలకరించాయి.

తెలుగు .. తమిళ భాషల్లో సక్సెస్ అనే మాట ఆమె విని చాలా కాలమైంది. ఈ నేపథ్యంలోనే ఆమెకి 'మన్మథుడు 2' సినిమా నుంచి ఆఫర్ వెళ్లింది. ఇప్పుడున్న సీనియర్ హీరోయిన్స్ ఆల్రెడీ నాగార్జునతో చేసి ఉండటం వలన రకుల్ ను సంప్రదించారు. అయితే అందుకు పారితోషికంగా ఆమె 2 కోట్లను అడిగిందట. సీనియర్ హీరోయిన్స్ కొరత ఉండటంతో, రకుల్ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధపడినట్టుగా సమాచారం. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగు ఇటీవలే మొదలైంది.
nagarjuna
rakul

More Telugu News