టెన్షన్ టెన్షన్.. పీలేరు వైసీపీ అభ్యర్థి నామినేషన్ పెండింగ్

  • నో డ్యూస్ సర్టిఫికెట్లను సమర్పించని చింతల
  • పెండింగ్ లో పెట్టిన రిటర్నింగ్ అధికారి
  • ఎన్నికల అధికారికి వివరణ ఇచ్చానన్న చింతల
చిత్తూరు జిల్లా పీలేరు వైసీపీ వర్గీయుల్లో టెన్షన్ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి నామినేషన్ ఇంకా పెండింగ్ లో ఉండటమే దానికి కారణం. నామినేషన్ పత్రాలతో పాట నో డ్యూస్ సర్టిఫికెట్లను ఇవ్వని కారణంగా నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి పెండింగ్ లో ఉంచారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నో డ్యూస్ సర్టిఫికెట్స్ పై ప్రత్యర్థులు అభ్యంతరాలను వ్యక్తం చేశారని తెలిపారు. ఎన్నికల అధికారికి తాను వివరణ ఇచ్చానని... తన సమాధానంపై ఎన్నికల అధికారి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.
Go Back to Shorts
pileru
ysrcp
chintala
nomination

More Telugu News