పవన్ కల్యాణ్ వాడుతున్న పదాలు మాకు నచ్చడంలేదు... ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ
- జగన్, విజయసాయిలపై నోరుపారేసుకుంటున్నారు
- నియమావళికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు
- మండిపడిన వైసీపీ నేత
ఎన్నికల నియమావళిని కూడా పట్టించుకోకుండా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న పవన్ కల్యాణ్ పై కఠినచర్యలు తీసుకోవాలంటూ నాగిరెడ్డి సీఈవోను కోరారు. పవన్ తన ప్రసంగాల్లో వాడుతున్న పదాలు తమకు అభ్యంతరకరంగా ఉన్నాయని నాగిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాకుండా, సామాజిక మాధ్యమంలో వైసీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని కూడా తెలిపారు.