‘జై తెలంగాణ’ అని నినాదం కూడా చేయని వాళ్లకు టికెట్టిచ్చారు: కేసీఆర్ కు వివేక్ లేఖ
- కేసీఆర్ ఆటబొమ్మలు కొందరు నాపై ఆరోపణలు చేశారు
- తెలంగాణ మేలు కోసమే టీఆర్ఎస్ లోకి వచ్చా
- ఉద్యమంలో ఏ పాత్ర లేనివాళ్లకు టికెట్లిచ్చారు
ఉద్యమంలో ఏ పాత్ర లేనివాళ్లకు, కనీసం ‘జై తెలంగాణ’ అని నినాదం కూడా చేయని వాళ్లకు టికెట్టిచ్చారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, మద్దతుదారులు కోరుతున్నప్పటికీ సమయం తక్కువగా ఉండడం వల్ల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. జీవితాంతం తెలంగాణ ప్రజల మేలు కోసం పని చేస్తూనే ఉంటానని, కష్ట కాలంలో తనకు తోడున్న మద్దతుదారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఆ లేఖలో వివేక్ పేర్కొన్నారు.