ప్రశ్నిస్తానని వచ్చి లాలూచీ పడ్డాడు.. జనసేనానిపై విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు
- దొంగలతో కలిసిపోయాడు
- అవినీతి సొమ్ముకు కాపలాకుక్కలా మారాడు
- ట్విట్టర్లో ఆరోపించిన వైసీపీ నేత
నిటారుగా, నిక్కచ్చిగా నిలబడాల్సిన ప్రశ్న మోచేతి నీళ్లు తాగేందుకు అడ్డంగా వంగిపోయిందని విమర్శించారు. ఓటమి తప్పదని అర్థమైపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుబంధ పార్టీలు దేనికైనా తెగించేందుకు సిద్ధమయ్యాయని ధ్వజమెత్తారు. ఎన్నికలు వాయిదా వేయించే ప్రయత్నం చేస్తారని, వైసీపీ కేడర్ సహనంతో ఉండాలని సూచించారు. దాడుల్ని అడ్డుకుని ప్రజలకు అండగా నిలవాలని కోరారు.