మహాత్మా గాంధీ ఏయే వ్యాధులతో బాధపడ్డారు? ఏ ఆపరేషన్లు చేయించుకున్నారు?.. తొలిసారి వెలుగులోకి వచ్చిన హెల్త్ రికార్డులు
- గాంధీ బరువు 46.7 కేజీలు
- సుదీర్ఘకాలం బీపీతో బాధపడ్డ మహాత్మా
- పైల్స్, అపెండిసైటిస్ ఆపరేషన్లు జరిగాయి
గాంధీ ఐదడుగుల ఐదు అంగుళాల ఎత్తుతో 46.7 కేజీల బరువు ఉండేవారని పుస్తకంలో వివరించారు. ప్రస్తుత లెక్కల ప్రకారం అయితే ఇది అండర్ వెయిట్ (ఉండాల్సిన దానికన్నా తక్కువ) కింద లెక్క. 1925, 1936, 1944లలో గాంధీ మూడు సార్లు మలేరియా వ్యాధి బారిన పడ్డారు. 1919లో పైల్స్, 1924లో అపెండిసైటిస్ ఆపరేషన్లు ఆయనకు జరిగాయి.
ఆయన లండన్ లో ఉన్న సమయంలో ఛాతీలో మంట కారణంగా ఇబ్బంది పడ్డారు. ఆహారం విషయంలో తనపై తాను చేసుకున్న ప్రయోగాలు... దీర్ఘకాల ఉపవాసాల కారణంగా ఆయన ఆరోగ్యం పలుసార్లు దెబ్బతింది. కొన్ని సందర్భాల్లో మరణం అంచుల వరకు కూడా వెళ్లారు. 1937-40 మధ్య కాలంలో చేయించుకున్న ఎలెక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ) రికార్డుల ప్రకారం ఆయనకు గుండె సంబంధిత ఇబ్బందులు లేవు.