యాసిడ్ దాడి బాధితురాలి బయోపిక్ గా 'ఛపాక్' .. దీపిక పదుకొనె ఫస్టులుక్ రిలీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాసిడ్ దాడి బాధితురాలి బయోపిక్ గా 'ఛపాక్' .. దీపిక పదుకొనె ఫస్టులుక్ రిలీజ్

  • బాలీవుడ్ నెంబర్ వన్ నాయికగా దీపిక
  • తాజా చిత్రంగా 'ఛపాక్'
  • వచ్చే ఏడాది జనవరి 10న విడుదల
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దీపిక పదుకొనె ఒకరు. హీరోలతో సమానమైన పారితోషికం తీసుకోవడం ఆమెకి గల క్రేజ్ కి నిదర్శనం. ఇక కొన్ని సినిమాలకి హీరోకన్నా ఎక్కువగానే పారితోషికం తీసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. అలాంటి దీపిక తాజాగా ఒక బయోపిక్ చేస్తోంది. ఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

మేఘన గుల్జార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి 'ఛపాక్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి దీపిక పదుకొనె ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. యాసిడ్ దాడి జరిగిన అనంతరం స్టిల్ ను ఫస్టులుక్ గా వదిలారు. గ్లామర్ క్వీన్ గా మార్కులు కొట్టేసిన దీపిక, 'ఛపాక్'లో ఈ తరహా లుక్ తో కనిపించడానికి సిద్ధపడటం సాహసమేనని చెప్పాలి. 2020 జనవరి 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా ఈ ఫస్టు పోస్టర్ ద్వారానే ప్రకటించారు.
deepika

More Telugu News