ఏడాది నిషేధానికి గురైనా చేవ తగ్గని వార్నర్... కోల్ కతాపై వీరవిహారం
- 53 బంతుల్లో 85 పరుగులు చేసిన వార్నర్
- నైట్ రైడర్స్ పై ఫిఫ్టీ
- సునాయాసంగా బ్యాటింగ్ చేసిన వైనం
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ లో వార్నర్ కేవలం 53 బంతుల్లో 85 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 9 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. సాధారణంగా సంవత్సరం పాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న ఆటగాళ్లు లయ అందుకోవాలంటే చాలా కష్టం. కానీ వార్నర్ ఆ ప్రభావం తనపై ఎంతమాత్రం లేదని చాటుతూ బంతిని బౌండరీలు దాటించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ వార్నర్ చలవతో 3 వికెట్లకు 181 పరుగులు చేసింది.