Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంగరంగ వైభవంగా హీరో వెంకటేష్ కుమార్తె వివాహం

  • జైపూర్ లో ఒక్కటైన అశ్రిత, వినాయక్ రెడ్డి
  • హాజరైన సినీ ప్రముఖులు
  • ఆదివారం తెల్లవారుజామున వివాహం
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత వివాహం ఈ ఉదయం అత్యంత వేడుకగా జరిగింది. రాజస్థాన్ లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్ గా పేరుగాంచిన జైపూర్ లోని ఓ స్టార్ హోటల్ ఈ సెలబ్రిటీ మ్యారేజికి వేదికగా నిలిచింది. ఈ పెళ్లికి మూడ్రోజుల ముందు నుంచే జైపూర్ తారాతోరణంతో కళకళలాడింది. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, బీనాకాక్ తదితరులు విచ్చేయగా, టాలీవుడ్ నుంచి రానా దగ్గుబాటి, అక్కినేని నాగచైతన్య-సమంత, రామ్ చరణ్-ఉపాసన తదితరులు హాజరయ్యారు.

శుక్రవారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించగా, శనివారం సంగీత్ కార్యక్రమంలో ఆడిపాడారు. ఇక ఆదివారం తెల్లవారుజామున వచ్చిన ముహూర్తంలో అశ్రిత, హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లికి వచ్చిన సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
Tollywood

More Telugu News